Sye Raa రెండు వారాల కలెక్షన్స్

Sye Raa రెండు వారాల కలెక్షన్స్
x
Highlights

భారీ అంచనాల మధ్యే కాదు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సైరా.. ఈ నెల 2 న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొణిదెల...

భారీ అంచనాల మధ్యే కాదు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సైరా.. ఈ నెల 2 న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సినిమాకి బెన్ ఫిట్ షో నుండే మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు ఎగబడ్డారు... ఉయ్యాలవాడ పాత్రలో చిరంజీవి నటనకి ఫిదా అయ్యారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినిమా సెలబ్రేటీస్ కూడా సైరా ఔరా అని కొనియాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా మంచి టాక్,మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. కానీ మిగిలిన భాషల్లో మాత్రం కలెక్షన్లు రావట్లేదనే చెప్పాలి.

సైరా సినిమా 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని టాక్.. ఇందులో 14 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 126.77 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ లేక్కన చూసుకుంటే సైరా 74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది.. తెలుగులో ఒకే అనిపిస్తున్న హిందీ,తమిళ, మలయాళం భాషలలో మాత్రం అంతత మాత్రంగానే ఉన్నాయని సినీ విశ్లేక్షలు చెబుతున్నారు. సైరాకి అంతో కొంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. కానీ సైరా నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ చిత్రానికి 130 కోట్ల వరకూ వచ్చాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories