సైరాలో మెయిన్ హైలైట్స్ ఇవేనట... !

సైరాలో మెయిన్ హైలైట్స్ ఇవేనట... !
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా... ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని రామ్ చరణ్ దాదాపుగా 300...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా... ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని రామ్ చరణ్ దాదాపుగా 300 కోట్లతో నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున సినిమాని విడుదల చేస్తున్నారు. విడుదలైన సినిమా ట్రైలర్స్, టిజర్ , సాంగ్స్ కి వీపరితమైన రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సినిమా మేకింగ్ వీడియోస్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. అయితే ఇప్పుడు సినిమాలోని కొన్ని హైలైట్స్ సినిమాకి ప్రధాన ఆకర్షనీయంగా నిలవనున్నాయని తెలుస్తుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

1. సినిమా టైటిల్స్ పవన్ కళ్యాణ్ వాయిస్ తో స్టార్ అయి ఎండ్ అవుతుందని తెలుస్తుంది. అయన గొంతు సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తుంది.

2.ఈ సినిమాలో అనుష్క ఝాన్సీ లక్షి బాయిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సైరా నరసింహ రెడ్డి మరణం అనంతరం ఆమె ఎంట్రీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టాక్..

3. ఇక ఈ సినిమాలోని మొదటి భాగంలో సైరా నరసింహ రెడ్డిని జమిందార్ గా చాలా హుందాగా చుపించానున్నారట.. ! ఇక రెండవ భాగంలో స్వాతంత్ర కోసం ఓ పోరాట యోదుడిగా బ్రిటిష్ వాళ్ళని అయన ఎలా ఎదురుకున్నాడు అన్నది చూపించానున్నారట..

4. ఇక వార్ సీక్వెన్స్ లో వచ్చే పోరాట సన్నివేశం సినిమాకి అతిపెద్ద ప్లస్ కానున్నది అని తెలుస్తుంది. ఇందులో చిరు,తమన్నానే కాకుండా వేలాది మందితో పోరాట సన్నివేశాలను తెరకెక్కించారట..

5.ఇక సినిమాని కెమరామెన్ రత్నవేలు చాలా అద్భుతంగా చిత్రికరించారట.. ఓ పాన్ ఇండియా సినిమాని ఎలా ఉండాలో అలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

6.ఇక సినిమాలో సాయి మాధవ్ బుర్రా రాసిన సంబాషణలు మెయిన్ హైలేట్ కానున్నాయట.. కొన్ని చోట్ల గూజ్ బంప్స్ రావడం ఖాయమని టాక్..

7.ఇక విదేశి మాస్టర్ నేతృత్వంలో తెరకెక్కిన క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోరాట సన్నివేశాలు సినిమాని మరో ఎత్తున నిలబెట్టనున్నాయని తెలుస్తుంది.

ఇవే కాకుండా సినిమాలోని మరికొన్ని అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. రేపు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories