Top
logo

Sye Raa :కలెక్షన్స్ రిపోర్ట్

Sye Raa :కలెక్షన్స్ రిపోర్ట్
Highlights

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటు అభిమానులే కాదు.. సినీతారలను కుడా సైరాకి ...

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటు అభిమానులే కాదు.. సినీతారలను కుడా సైరాకి ఔరా అనేస్తున్నారు. దీనితో సైరా సినిమా భారీ కలెక్షన్ల దిశాగా దూసుకుపోతుంది. పండగ దినాలల్లో కూడా సైరాకి కలెక్షన్ల పరంగా ఎక్కడ బ్రేక్ పడలేదు.. రెండు తెలుగు రాష్ట్రాలలో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకుంది ఈ సినిమా . ఎనిమిది రోజులకు గాను సైరా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 90కోట్ల షేర్ రాబట్టింది. ఎనిమిదవరోజు కూడా నైజాంలో సైరా 2.47 కోట్ల షేర్ సాధించడం చిరు సత్తాని చాటుతుంది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకపోవడం చాలా ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇక వీకెండ్ కూడా రావడంతో సైరాకి మరిన్ని కలెక్షన్లు రాబడుతుంది అనడంలో సందేహం అక్కరలేదు.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

Next Story