హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సైరా నరసింహారెడ్డి

హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సైరా నరసింహారెడ్డి
x
Highlights

సైరా సినిమా హిట్ టాక‌‌తో దూసుకుపోతోంది. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. చిరంజీవి అద్భుతంగా నటించిన సైరా...

సైరా సినిమా హిట్ టాక‌‌తో దూసుకుపోతోంది. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. చిరంజీవి అద్భుతంగా నటించిన సైరా నరసింహారెడ్డి తమకు పెద్ద పండగలాంటిదని విశాఖలో అభిమానులు చెబుతున్నారు.

భావిభారత సంగ్రామానికి తొలి నాంది వేసింది ఓ తెలుగు వాడు అన్న నిజం చాలామందికి తెలియదు అంటున్నారు కర్నూలు జిల్లా వాసులు. రాయలసీమలో ఉన్నా కూడా ఆంగ్లేయులను ఎదిరించి వారిని గజగజలాడించిన తొలి సింహం సీమదే అన్న సంగతి ఇప్పటివరకు తెలియకపోవడం చాలా బాధాకరం అంటున్నారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ బాగుందని కర్నూలు వాసులు చెప్తున్నారు.

సైరా నరసింహారెడ్డి చిత్రం కర్నూలు జిల్లాలో గ్రాండ్‌గా రిలీజైంది. సినిమా భారీగా హిట్ కావడంతో మెగా అభిమానులు సందడి చేసుకుంటున్నారు. చిరంజీవి తన నట విశ్వరూపాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కరించారని సంబరపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories