సైరా నుండి మరో సర్‌ప్రైజ్‌...?

సైరా నుండి మరో సర్‌ప్రైజ్‌...?
x
Highlights

సినిమా లిరికల్ సాంగ్ ని వచ్చే వారం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ లిరికల్ సాంగ్ ని అద్భుతంగా కట్ చేసారని తెలుస్తుంది .

ఖైది నెంబర్ 150 సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా .. మెగాస్టార్ కెరియర్ లోనే అత్యంత భారి బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది . కొణిదెల ప్రొడక్షన్స్ పై అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు .. దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కినట్లు సమాచారం ..

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులో బిజీగా ఉంది . అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది . సినిమాలో మెగాస్టార్ లుక్ , సినిమా టిజర్, ట్రైలర్ సినిమా పైన భారీ అంచనాలే పెంచాయి .. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా సినిమాలోని మొదటి లిరికల్ సాంగ్ ని విడుదల చేసేందుకు రంగం సిద్దం అయినట్లు ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది .

సినిమా లిరికల్ సాంగ్ ని వచ్చే వారం విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దంగా ఉందని అందుకోసమే లిరికల్ సాంగ్ ని అద్భుతంగా కట్ చేసారని తెలుస్తుంది . సినిమాని మొత్తం ఐదు బాషల్లో రిలీజ్ చేస్తున్నారు . దీనికి తగట్టుగానే సినిమా ప్రమోషన్ కూడా గట్టిగానే జరుగుతునట్లు టాక్ నడుస్తుంది .

స్వాతంత్ర్య సమరయోధుడి జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కింది . దీనికి స్టైలిష్ డైరెక్టర్ గా పేరుపొందిన సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరనస నయనతార నటిస్తుంది . అంతేకాకుండా ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ , సుదీప్ , తమన్నా , విజయ సేతుపతి , నిహారిక మొదలగు నటినటులు నటిస్తున్నారు .

ఈవారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారో ఇక్కడ తెలపండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories