చిరు కెరియర్ లోనే సైరా ది బెస్ట్.. 12 రోజుల్లోనే ఎంతంటే ?

చిరు కెరియర్ లోనే సైరా ది బెస్ట్.. 12 రోజుల్లోనే ఎంతంటే ?
x
Highlights

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. విడుదలైన 12...

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులు చాలా బాగా ఆదరిస్తున్నారు. విడుదలైన 12 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లను కొల్లగోట్టినట్టు సమాచారం. ఇక అమెరికాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా సైరా రికార్డు సృష్టించింది. అక్కడ ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్లు కొల్లగోట్టినట్టుగా విశ్లేషకులు చెబుతున్నారు. విడుదలైన తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో సైరా మంచి టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి నటన బాగుందని అయన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెబుతున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని రామ్ చరణ్ 300 కోట్ల బడ్జెట్ తో రుపొందిచారు. చిరంజీవితో పాటు నయనతార,అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి,తమన్నా,అనుష్కలు నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ రెండున విడుదల అయింది. సైరా కేవలం ప్రేక్షకులు నుండి మాత్రమే కాదు సెలబ్రేటి ల నుండి కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories