దుక్కంతో ఏడ్చేసా : సురేష్ బాబు

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ.. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు.
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ.. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. పక్కా ఫ్యామిలీ కథతో తెరకెక్కిన ఈ సినిమాని వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13 న విడుదల చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తుండగా, బాబీ( కే. యస్ రవీంద్ర ) దర్శకత్వం వహించారు.
సినిమా విడుదల దగ్గర పడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో హీరోలు వెంకటేష్, నాగచైతన్యతో పాటు హీరోయిన్ రాశీఖన్నా, దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ), ఈ చిత్ర నిర్మాతలు సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ " ఎమోషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఏడాదిన్నర క్రితం జనార్ధన్ మహర్షి అనే రైటర్ మాకు ఈ కథని ఇచ్చాడు, దీనిని మేము బాబీకి ఇవ్వడంతో చాలా చక్కగా డెవలప్ చేసి సినిమాని తీశాడు. రాజమండ్రి, హైదరాబాద్, కాశ్మీర్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంది. కాశ్మీర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు భారత అధికారులు, ఆర్మీ అధికారులు చాలా సహాయపడ్డారు. ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ఈ సినిమాని నేను చూశానని, క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశానని " సురేష్ బాబు అన్నారు.
ఇక ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి ధన్యవాదాలు తెలిపారు సురేష్ బాబు.. ఈ సినిమాని తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకి మంచి స్పందన వస్తుంది. డిసెంబర్ 13న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండగా, డిసెంబర్ 7న ఖమ్మంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఏర్పాటు చేస్తున్నారు.
లైవ్ టీవి
ప్రయాణికులకు మరింత చేరువ కానున్న హైదరాబాద్ మెట్రో
15 Dec 2019 5:07 PM GMTమొదటి వన్డేలో భారత్ ఓటమి
15 Dec 2019 4:38 PM GMTరాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు
15 Dec 2019 4:19 PM GMTత్వరలోనే రామ్ చరణ్ తో సినిమా ఉంటుంది : పవన్ కళ్యాణ్
15 Dec 2019 3:57 PM GMTజనగామ జిల్లాలో మంత్రులను అడ్డుకున్న మహిళలు
15 Dec 2019 3:34 PM GMT