త్వరలో హీరోయిన్ గా సురేఖ వాణి కూతురు?

త్వరలో హీరోయిన్ గా సురేఖ వాణి కూతురు?
x
Highlights

సురేఖ వాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి చాలా సినిమాలో నటించారు.

సురేఖ వాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు బహుశా ఉండరేమో.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి చాలా సినిమాలో నటించారు. అంతేకాకుండా బుల్లితెరపై పలు కార్యక్రమాలకి యాంకర్ గా కూడా వ్యవహరించారు. గత కొద్ది కాలం క్రితం ఆమె భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే.. వీరికి ఒక అమ్మాయి కూడా ఉంది . ఆమె పేరు సుప్రీత.. సుప్రీత ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు.

సుప్రీత ప్రస్తుతం చదువుకుంటునే, తన తల్లికి ఇష్టమైన సినీ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. ఆమె నటించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా యూట్యూబ్ లో విడుదలయ్యాయి. అంతేకాకుండా టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ ని కూడా సంపాదించుకుంది. అయితే ఇప్పడు ఇదే తన కూతురుని హీరోయిన్ చేయాలనీ సురేఖ వాణి భావిస్తున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఓ చిన్న సినిమా ద్వారా సుప్రీత్ ని హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేయాలనీ సురేఖ వాణి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది! కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇక సురేఖ వాణి అభిమానులు కూడా సుప్రీత హీరోయిన్ గా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఇప్పటికే నట వారసురాలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ పలువురు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ లిస్టు లోకి సుప్రీత ఎప్పుడు చేరనుంది అన్నది చూడాలి మరి!



Show Full Article
Print Article
More On
Next Story
More Stories