సూపర్ స్టార్ కృష్ణతో మిస్ అయిన ....మహేష్ తో కొట్టేశాడు

సూపర్ స్టార్ కృష్ణతో మిస్ అయిన  ....మహేష్ తో కొట్టేశాడు
x
Highlights

పూరి జగన్నాధ్ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. హీరో అంటే హీరో లాగే ఉండాలి అన్న ఇమేజ్ ని మొత్తం మార్చేసిన దర్శకుడు. హీరోని కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం...

పూరి జగన్నాధ్ పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. హీరో అంటే హీరో లాగే ఉండాలి అన్న ఇమేజ్ ని మొత్తం మార్చేసిన దర్శకుడు. హీరోని కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్... అయితే అందరికి పూరి మొదటి సినిమా అంటే పవన్ కళ్యాణ్ నటించిన బద్రి సినిమానే గుర్తొస్తుంది. కానీ పూరికి ముందు సూపర్ స్టార్ కృష్ణ ఛాన్స్ ఇచ్చారు. దర్శకుడుగా పూరికి అది మొదటి సినిమా అయినప్పటకి పూరి కథ చెప్పిన స్టైల్ కి కృష్ణ ఫిదా అయిపోయారట.. వెంటనే డేట్స్ ఇచ్చి షూటింగ్ మొదలుపెట్టారు...

ఈ సినిమాకి "థిల్లాన" అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు.. బి.లహరి మ్యూజిక్కు. శ్యామ్.కె.నాయుడు కెమెరా. మూడు పాటలు రికార్డ్ చేశారు. ఓ రోజు షూటింగ్ కూడా చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. అలా అ తర్వాత బద్రి సినిమా అవకాశం రావడంతో పూరి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇక సూపర్ స్టార్ తో సినిమా తీసి హిట్టు కొట్టాలనుకున్నా పూరి అయన తనయుడు మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు తీసి హిట్టు కొట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories