నాకేం కాలేదు..సినిమాని ఎంజాయ్ చేయండి : సునీల్

నాకేం కాలేదు..సినిమాని ఎంజాయ్ చేయండి : సునీల్
x
Highlights

హీరో, కమెడియన్ సునీల్ స్వల్ప అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరిన సంగతి తెలిసిందే.. అయితే ...

హీరో, కమెడియన్ సునీల్ స్వల్ప అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరిన సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన మీడియాలో వార్తలు రావడంతో సునీల్‌ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే సునీల్ ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో సునీల్ దీనిపైన స్పందించాడు.

ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చిన సునిల్ తనకు ఏం కాలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా మరో పోస్ట్ పెట్టాడు. నన్ను అభిమానించే మీలాంటి శ్రేయోభిలాషులు ఉండటం నాకు ఆశీర్వాదం అనిపిస్తుంది. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మరియు మీ ప్రేమకి చాలా ధన్యవాదాలు. అంటూనే రేపు డిస్కో రాజా థియేటర్స్‌లోకి వస్తుంది ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో సునీల్ రవితేజ పక్కన ఓ కీలక పాత్రలో నటించాడు.

తాజాగా సునీల్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురములో' చిత్రంలో నటించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories