logo

టాలీవుడ్ ని కంగారు పెట్టిస్తోన్న సమ్మర్ హాలీడేస్

టాలీవుడ్ ని కంగారు పెట్టిస్తోన్న సమ్మర్ హాలీడేస్
Highlights

మేనెలతో సమ్మర్ హాలీడేస్ అయిపోతున్నాయి దీంతో టాలీవుడ్ బ్యాచ్ లో కంగారు పెరిగింది అందుకే కలిసొచ్చే ఈ సీజన్ ని...

మేనెలతో సమ్మర్ హాలీడేస్ అయిపోతున్నాయి దీంతో టాలీవుడ్ బ్యాచ్ లో కంగారు పెరిగింది అందుకే కలిసొచ్చే ఈ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు అంతా బాక్సాఫీస్ మీద దాడికి సిద్ధమయ్యారు. మహేశ్ బాబు మహర్షి తో సహా 15 సినిమాలే మేనెల మీద ఎటాక్ చేయబోతున్నాయి.

మే నెల పూర్తయ్యిందంటే, సమ్మర్ కి సెండాఫ్ చెప్పే టైం వచ్చినట్టే అందుకే సమ్మర్ హాలీడేస్ ని క్యాష్ చేసుకునేందుకు ఫిల్మ్ మేకర్స్ అంతా తమ మూవీల రిలీజ్ లతో బాక్సాఫీస్ ముందు క్యూ కట్టారు. ఆల్రెడీ నువ్వు తోపురా, గీత చలో సినిమాలు విడుదలయ్యాయి ఇక మే 9 న మహర్షి మూవీ రాబోతోంది. మే 10 న నాగకన్య వస్తోంది ఇక మే 11 న ఎవడూ తక్కువ కాదు మూవీ రాబోతోంది. ఆతర్వాత మే 17 న ఏబీసీడీ మూవీ రిలీజ్ కాబోతోంది. ఏబీసీడీ మూవీ తోపాటు మే 17 న, ఇస్మార్ట్ శంకర్ ఫిల్మ్ రాబోతోంది. పూరీ మేకింగ్ లో రామ్ చేస్తోన్న ఈసినిమాకు ముహుర్తం కుదిరిన రోజే నిఖిల్ మూవీ అర్జున్ సురవరం కూడా విడుదలౌతోంది మొత్తంగా మే 17 నే ఇలా మూడు సినిమాలు రాబోతున్నాయి

బెల్లం కొండ శీను , కాజల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సీత. ఈ సినిమా మే 24 న రిలీజ్ కాబోతోంది అదే రోజు హీరో రాజశేఖర్ మూవీ కల్కీ కి ముహుర్తం కుదిరింది.

తమిళ స్టార్ సూర్య , రకుల్ , సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఎన్జీకే ఈసినిమా మే 31 న విడుదలవుతుంటే, అదే రోజు రిలీజ్ ప్లాన్ చేసుకున్న డియర్ కామ్రెడ్ మూవీ విడుదల వాయిదా పడుతుందన్నారు కాని విజయ్ దేవరకొండ మూవీ డియర్ కామ్రెడ్ సూర్య సినిమా ఎన్జీకేతో పోటీ పడటానికే సిద్ధమైనట్టు మరో ప్రచారం నడుస్తోంది. తమన్నా, ప్రభుదేవ కాంబినేషన్ లో తెరకెక్కిన అభినేత్రి సీక్వెల్ అభినేత్రి 2 మే 31 న విడుదలకాబోతోంది ఎన్టీకే, డియర్ కామ్రెడ్ మూవీతో అభినేత్రి 2 సినిమా పోటీ పడుతుంటే, ఈ మూడు పెద్ద సినిమాలతో సువర్ణ సుందరి సినిమా పోటీ పడుతూ అదే రోజు దండెత్తబోతోంది.


లైవ్ టీవి


Share it
Top