ఎంత మంచివాడవురాలో ఆమె పాత్ర కీలకం ...

ఎంత మంచివాడవురాలో ఆమె పాత్ర కీలకం ...
x
Highlights

అతనొక్కడే హిట్టు తరవాత హిట్టు చూడడానికి కళ్యాణ్ రామ్ కి దాదాపుగా పది సంవత్సరాలు పట్టింది. పటాస్ లాంటి పవర్ ఫుల్ హిట్టు వచ్చినప్పటికీ ఆ హిట్టును...

అతనొక్కడే హిట్టు తరవాత హిట్టు చూడడానికి కళ్యాణ్ రామ్ కి దాదాపుగా పది సంవత్సరాలు పట్టింది. పటాస్ లాంటి పవర్ ఫుల్ హిట్టు వచ్చినప్పటికీ ఆ హిట్టును కాపాడుకోలేకపోయాడు కళ్యాణ్ రామ్.. ఇక మాస్ సినిమాలు పక్కన పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ గా 118 సినిమా చేసినప్పటికీ హిట్టు రాలేదు. ఇక ఎంత మంచివాడవురా అంటూ పూర్తి స్థాయి కుటుంబ చిత్రంతో త్వరలో ముందుకు రానున్నాడు . సతీష్ విగ్నేశ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇందులో కళ్యాణ్ రామ్ సరసన మేహరీన్ నటిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ , టిజర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో సుహాసిని పాత్ర కీలకం కానుంది అని తెలుస్తుంది. కథ మొత్తం ఆమె చుట్టూ తిరనుంది అని సమాచారం.. ఇంత మంచి పాత్ర దక్కడంతో ఆమె మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలు చేసేందుకు ఒప్పుకుందని తెలుస్తుంది.

తాజాగా పల్నాడులోలో జరుగుతున్న ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సంక్రాంతి పండగకు సినిమా విడుదల కానుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories