రాజమౌళి.. కలెక్షన్ల సునామీ!

రాజమౌళి.. కలెక్షన్ల సునామీ!
x
Highlights

రాజమౌళి..దర్శకదీరుడు.. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన దార్శనికుడు. పదకొండు సినిమాలు ఇప్పటివరకూ దర్శకత్వం వహించారు రాజమౌళి. ఒక్క పరాజయం...

రాజమౌళి..దర్శకదీరుడు.. తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన దార్శనికుడు. పదకొండు సినిమాలు ఇప్పటివరకూ దర్శకత్వం వహించారు రాజమౌళి. ఒక్క పరాజయం కూడా లేదు. ఈ సినిమాలన్నీ వేటికవే ఆ సందర్భంలో తెలుగు తెరపై రికార్డులు సృష్టించాయి. కలెక్షన్లు కొల్లగొట్టడం అనే మాట నుంచి రికార్డులు తిరగ రాయడం అనేంత వరకూ రాజమౌళి అన్ని ఫీట్ లు సాధించేశారు. అయన దర్శకత్వం వహించిన సినిమాలు సాధించిన కలెక్షన్లు ఒక్కసారి పరిశీలిస్తే.. రాజమౌళి కమర్షియల్ గా ఎంత విజయవంతమైన దర్శకుడో తేట తెల్లం అవుతుంది.

1. స్టూడెంట్ నెo. 1

మూడు కోట్లతో నిర్మితమైన ఈ స్టూడెంట్ నంబర్ 1 ని నాలుగు కోట్లకు అమ్మగా 12 కోట్లు వసూలు చేసింది.

2. సింహాద్రి

ఎనిమిది కోట్లతో రూపుదిద్దుకున్న సింహాద్రిని 13 కోట్లకు విక్రయించారు. మొత్తంగా 26 కోట్లు వసూలు చేసింది

3. సై

5 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సై 7 కోట్లకు విక్రయించగా 9.5 కోట్లు వచ్చాయి.

4. ఛత్రపతి

10 కోట్లతో నిర్మించిన ఛత్రపతి 13 కోట్లకు విక్రయించగా 21కోట్లు రాబట్టింది.

5. విక్రమార్కుడు

11 కోట్లతో తెరకెక్కిన విక్రమార్కుడు 14 కోట్లకు అమ్మగా, 19.50 కోట్లు వసూలు చేసింది.

6. యమదొంగ

18 కోట్లతో రూపుదిద్దుకున్న యమదొంగ 22 కోట్లకు అమ్ముడు పోయింది. 28.75 కోట్లు కలక్షన్స్ సాధించింది.

7. మగధీర

44 కోట్లతో తెరకెక్కిన మగధీర 48 కోట్లకు విక్రయించారు. 151 కోట్లు కొల్లగొట్టింది.

8. మర్యాదరామన్న

14 కోట్లతో నిర్మితమైన మర్యాద రామన్న 20 కోట్లకు అమ్ముడుపోయింది. 29 కోట్లు వసూలు చేసింది.

9. ఈగ

అత్యధిక గ్రాఫిక్స్ గల ఈగ 26 కోట్లతో నిర్మితమై 32 కోట్లకు విక్రయించారు. 42.30 కోట్లు కొల్లగొట్టింది.

10. బాహుబలి

136 కోట్లతో నిర్మించిన బాహుబలి బిగినింగ్ మూవీని 191 కోట్లకు అమ్మారు. ఇది 602 కోట్లు వసూలు చేసింది.

11. బాహుబలి 2

ప్రభాస్ వీరోచితంగా నటించిన బాహుబలి కంక్లూజన్ 250 కోట్లతో నిర్మితమై వంద రోజుల్లో 1917 కోట్లు రాబట్టి ఔరా అనిపించింది.

12 వ సినిమా RRR బడ్జెట్ ?

ఇక దీనిగురించి ప్రస్తుతం ఏమీ చెప్పే పరిస్థితి లేదు.. ఈ మధ్యకాలంలో తెలుగు తెరపై లేనటువంటి.. రానటువంటి.. క్రేజీ కాంబినేషన్ తొ వస్తున్న మల్టీ స్టారర్ ఇది. దీని బిజినెస్.. గురించి తెలియాలంటే మరో ఆరేడు నెలలు ఆగాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories