శ్రీరామనవమి సందర్భంగా కొత్త పోస్టర్ల కళ

శ్రీరామనవమి సందర్భంగా కొత్త పోస్టర్ల కళ
x
File Photo
Highlights

కరోనాని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో చిత్ర పరిశ్రమకి సంబంధించి ధియేటర్లు మూసివేశారు.

కరోనాని అరికట్టేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో చిత్ర పరిశ్రమకి సంబంధించి ధియేటర్లు మూసివేశారు. షూటింగ్ లు కూడా వాయిదా పడ్డాయి. ఇక విడుదలకి సిద్దం అయిన సినిమాలు కూడా తమ విడుదల తేదిలను పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఇక ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా కొన్ని కొత్త సినిమాలకి సంబంధించి కొత్త పోస్టర్ లను రిలీజ్ చేశారు. దీనితో అభిమానులకి కాస్తా ఉరట లభించినట్టు అయింది. ఇంతకి అవి ఏమిటో చూద్దాం..

రవితేజ - క్రాక్

డిస్కో రాజా సినిమా తర్వాత మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం 'క్రాక్‌'.. ఇందులో రవితేజ ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఫ్యామిలీతో సరదాగా ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ 'ఇంట్లోనే ఉండండి. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేయండి' అని చిత్ర యూనిట్ పేర్కొంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డాన్, బలుపు సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.


వైష్ణవ్ తేజ్ - ఉప్పెన

మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఉప్పెన' .. కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, సాంగ్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచేశాడు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ .. 'ప్రతి ఒక్కరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. ఇంట్లోనే ఉండి ఆ మహమ్మారిని చంపాల్సిన సమయమిది' అని ట్వీట్‌ చేసింది.


సత్యదేవ్‌ - ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు దర్శకుడు వెంకటేశ్‌ మహా .. ప్రస్తుతం అయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'.. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. బాహుబలి లాంటి బిగ్గెస్ట్ మూవీని తెరకెక్కించిన ఆర్కా మీడియా వర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. తాజగా శ్రీరామనవమి సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతూ.. 'ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తగా జీవించండి'అని పేర్కొంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories