వేలానికి శ్రీదేవి చీర.. ఎంత ధర పలికిందో తెలుసా..?

వేలానికి శ్రీదేవి చీర.. ఎంత ధర పలికిందో తెలుసా..?
x
Highlights

అభిమానులనుండి అతిలోక సుందరి శ్రీదేవి దూరమై ఫిబ్రవరి 24 వ తేదీకి సంవత్సరం అవుతోంది. దీంతో శ్రీదేవి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ...

అభిమానులనుండి అతిలోక సుందరి శ్రీదేవి దూరమై ఫిబ్రవరి 24 వ తేదీకి సంవత్సరం అవుతోంది. దీంతో శ్రీదేవి తొలి వర్ధంతిని ఘనంగా నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు. శ్రీదేవి వర్ధంతి రోజు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో శ్రీదేవి కట్టుకున్నచీరను వేలం వేసి వచ్చిన డబ్బుతో ఆమె పేరుమీద దాన ధర్మాలు చేయాలనీ అనుకున్నారు.

దీంతో శ్రీదేవి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఓ 'కోటా చీర'ను 'పరిసెరా' వెబ్‌సైట్‌లో వేలానికి ఉంచారు. ప్రారంభ వేలం ధరని రూ. 40 వేలకు నిర్ణయించగా బుధవారం సాయంత్రానికి అది రూ.90 వేలకు చేరింది. శ్రీదేవి వర్ధంతిఫిబ్రవరి 24 నాటికి ఈ చీర రికార్డు ధర పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories