logo
సినిమా

అందాల జాబిలి మదిలో...

అందాల జాబిలి మదిలో...
X
Highlights

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి మన మధ్య నుంచి దూరమై అప్పుడే ఏడాది గడుస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు తన భర్త బోనీ...

అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి మన మధ్య నుంచి దూరమై అప్పుడే ఏడాది గడుస్తోంది. ఈ సందర్భంగా ఆమెకు తన భర్త బోనీ కపూర్‌ ఘనంగా నివాళి అర్పించారు. ఇవాళ శ్రీదేవీ వర్ధంతితో పాటు తమ 22 వ పెళ్లిరోజు అని తనెప్పుడూ సంతోషకరమైన తమ జీవితాల్లో జీవించే ఉంటుందని బోనీ కపూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె చివరి రోజుల్లో తీసిన వీడియోను పోస్ట్‌ చేశారు. ఇటు శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్‌ తన హృదయం ఎప్పుడూ బాధతో నిండి ఉంటుందని కానీ తానెప్పుడూ నవ్వుతూ ఉంటానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఆ నవ్వుల్లో అమ్మ శ్రీదేవీ ఉంటుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

Next Story