సింగర్ గా శ్రీముఖి

సింగర్ గా శ్రీముఖి
x
Srimukhi as Singer File Photo
Highlights

యాంకర్ శ్రీముఖి పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీ లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అనంతరం ఆమెకి మంచి క్రేజ్ ఏర్పడింది.

యాంకర్ శ్రీముఖి పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమ్రోగిపోతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీ లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన అనంతరం ఆమెకి మంచి క్రేజ్ ఏర్పడింది. షోలో చివరివరకు విన్నర్ కోసం పోరాడిన శ్రీముఖి ఆఖరినిమిషంలో మాత్రం రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత శ్రీముఖి ఏ షోకి యాంకర్ గా చేస్తుందని ఆమె అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో శ్రీముఖి సింగర్ గా అవతారం ఎత్తింది. తాజాగా స్టార్ యాజ‌మాన్యం శ్రీముఖి షోకి సంబంధించిన చిన్న ప్రోమో విడుద‌ల చేశారు. ఆ ప్రోమోలో శ్రీముఖి పాట పాడుతూ, స్టెప్పులు వేస్తూ అల‌రించింది. స్టార్ మా మ్యూజిక్ రీలోడెడ్ అనే కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి ఆడిపాడింది. ప్రస్తుతం దేనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories