అసలు రిలేషన్షిప్‌ ఇప్పుడు మొదలైంది!

అసలు రిలేషన్షిప్‌ ఇప్పుడు మొదలైంది!
x
శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌
Highlights

ఇటివల ముగిసిన బిగ్ బాస్ 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి సక్సెస్ ని సాధించిన ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు.

ఇటివల ముగిసిన బిగ్ బాస్ 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మంచి సక్సెస్ ని సాధించిన ఈ షోలో రాహుల్ సిప్లిగంజ్‌ విజేతగా నిలిచాడు. ఇక రన్నరప్ గా యాంకర్‌ శ్రీముఖి నిలిచింది. షో కి ముందు మంచి స్నేహితులు అనిపించుకున్న శ్రీముఖి, రాహుల్‌ హౌస్‌లోకి ఎంటర్‌ అయ్యాక మాత్రం బద్ధ శత్రువులుగా మారిపోయారు. బిగ్ బాస్ షోలో ఉన్నంత కాలం రాహుల్‌తో గొడవ పడుతూ వీలున్నప్పుడల్లా రాహుల్‌ను నామినేట్ చేస్తూ వచ్చింది శ్రీముఖి.. ఇక రాహుల్ కూడా ఎలాగో నేట్టుకోచ్చ్జి షో చివరి మూడు వారాలలో మాత్రం బాగా క్లిక్ అయ్యాడు. ఇక బయటకి వచ్చాక ఎవరిదారిలో వారు బిజీ అవుతూ వచ్చారు.

రాహుల్ పాటలతో బిజీ అయిపోతే, శ్రీముఖి కొత్త ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేస్తుంది. షో అయిపోయాక పలు పార్టీలలో ఎక్కడ కూడా రాహుల్ శ్రీముఖి కనిపించింది లేదు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసిపోయారు. ఓ పార్టీలో కలిసి సందడి చేశారు. దీనికి సంబందించిన ఓ వీడియోను వితిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా రాహుల్ తో ఉన్న ఫోటోను శ్రీముఖి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి `గతం గత:! అసలు రిలేషన్షిప్‌ ఇప్పుడు మొదలైంది!' అంటూ పోస్ట్ పెట్టింది. వీరిద్దరి తిరిగి కలిసిపోవటంతో ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories