బాలయ్యతో సినిమా చేయడం లేదు .. క్లారిటీ ఇచ్చిన నటి

బాలయ్యతో సినిమా చేయడం లేదు .. క్లారిటీ ఇచ్చిన నటి
x
balakrishna
Highlights

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధిచిన పూజా కార్యక్రమాలు...

సింహ, లెజెండ్ సినిమాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధిచిన పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. వచ్చే ఏడాది జనవరిలో సినిమా పట్టలేక్కనుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపైన చిత్ర యూనిట్ ఇంతవరకు స్పందించింది లేదు.

తాజాగా సోనాక్షి సిన్హా తన అధికార ట్విట్టర్ ద్వారా స్పందించింది. "బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో నేను హీరోయిన్ గా నటిస్తున్నాని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తలు అవాస్తవం. నా తర్వాతి సినిమాల గురించి అధికార ప్రకటన త్వరలో రాబోతుందని" సోనాక్షి ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనాక్షి సిన్హా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ 3 లో హీరోయిన్ గా నటించింది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత బోయపాటి, బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ రూలర్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకి కే. యస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ , బాలయ్య లూక్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాని క్రిస్మస్ పండుగకి కానుకగా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలకృష్ణకి జోడిగా వేదిక, సోనాలి చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. చిరంతన్ భట్ సంగీతం అందించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories