Top
logo

ఆరంభ సీన్లకే 60 కోట్ల ఖర్చట!

ఆరంభ సీన్లకే 60 కోట్ల ఖర్చట!
Highlights

బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసింది. సినిమాకి పెట్టిన ఖర్చు దగ్గర నుంచి రాబట్టిన సొమ్ము వరకూ ప్రతీ అంశం...

బాహుబలి ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసింది. సినిమాకి పెట్టిన ఖర్చు దగ్గర నుంచి రాబట్టిన సొమ్ము వరకూ ప్రతీ అంశం సెన్సేషన్ సృష్టించింది. ఇదంతా రాజమౌళి మ్యాజిక్. ఇపుడు తాజాగా మరో మ్యాజిక్ కు సిద్ధం అయిపోయాడు. భారీ బడ్జెట్ తో.. మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతునన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమా 2020 లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

ఇపుడు ఈ సినిమా షూటింగ్ విశేషాలు ఔరా అనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కేవలం ఇద్దరు హీరోల పరిచయం సన్నివేశాల కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక పెద్ద బడ్జెట్ సినిమానే తీసేయగాలిగెంత బడ్జెట్ ఇంట్రడక్షన్ కే ఖర్చు పెడితే ఇక క్లైమాక్స్ ఏ రేంజిలో ఉంటుందో అని అభిమానులు సంబరపడిపోతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమదింస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడిగా నటించే విదేశీ భామ కోసం వెతుకుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రలో అలరించనున్నాడు.లైవ్ టీవి


Share it
Top