18 Pages: నిఖిల్ కోసం సింగర్ గా మారిన కోలీవుడ్ స్టార్ హీరో..

Simbu Sings A Song for Nikhil Siddharth’s 18 Pages
x

18 Pages: నిఖిల్ కోసం సింగర్ గా మారిన కోలీవుడ్ స్టార్ హీరో..

Highlights

Nikhil Siddharth: యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

Nikhil Siddharth: యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ మధ్యనే కార్తికేయ 2 సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కర్లీ హెయిర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్‌ల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి సినిమా అది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లు నమోదు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా సంచలన విజయాన్ని సృష్టించింది.

తాజాగా ఇప్పుడు ఈ జంట మళ్ళీ "18 పేజెస్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథను అందించారు. ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన "నన్నయ్య రాసిన.." పాట కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ కోలీవుడ్ హీరో శింబు కూడా ఒక పాట పాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ లో బోలేడు సినిమాలతో బిజీగా ఉన్న శింబు నిఖిల్ కోసం సినిమాలో పాట పాడటం నిజంగా విశేషం. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. జి ఏ 2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఏ వసంత్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories