ష్.. సైలెన్స్! అసలు లుక్ ముందుంది!

ష్.. సైలెన్స్! అసలు లుక్ ముందుంది!
x
Highlights

అనుష్క.. హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. చాలా కాలం గ్యాప్ తరువాత తన మౌనానికి బ్రేక్ ఇచ్చింది. సైలెన్స్ సినిమాకి ఓకే చెప్పింది. శరవేగంగా షూటింగ్...

అనుష్క.. హీరోలతో సమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్. చాలా కాలం గ్యాప్ తరువాత తన మౌనానికి బ్రేక్ ఇచ్చింది. సైలెన్స్ సినిమాకి ఓకే చెప్పింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తైంది. త్వరలోనే ఫస్ట్ లుక్ రానుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే, ఈ లోపు అభిమానుల కోసం అనుష్క శాంపిల్ లుక్ విడుదల చేసింది. సైలెన్స్ సినిమాలోని తన ఫోటో ఒకదానిని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అనుష్క.

చుట్టూ ఎరుపు రంగు.. మధ్యలో తెల్లటి డ్రస్ లో అనుష్క.. పొట్టి జుట్టుతో చేతిలో పుస్తకం పట్టుకుని ఏదో రాస్తున్నట్లుగా అనుష్క లుక్‌ ఉంది. 'త్వరలో స్పాట్‌లైన్‌లోకి వస్తాను' అని దానికి క్యాప్షన్ కూడా ఇచ్చింది. అందుకే దీనిని శాంపిల్ లుక్ అంటున్నాం. ఇది ఆకట్టుకుంటోంది.

హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ మైఖెల్‌ మ్యాడసన్‌ కూడా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories