RRR లో శ్రియ.. ఆ హీరోకి జోడిగా?

RRR లో శ్రియ.. ఆ హీరోకి జోడిగా?
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్

బాహుబలి సినిమా తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జూలై 30న భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ కూడా నటిస్తోందని తెలుస్తోంది. హీరో అజయ్ దేవగన్ కి జోడిగా ఆమె పాత్ర ఉందని, దర్శకుడు అజయ్ దేవగన్, శ్రియల పైన కీలక సన్నివేశాలను చిత్రికరిస్తున్నాడని సమాచారం.. శ్రియకి అజయ్ దేవగన్ , రాజమౌళితో ఇది రెండో సినిమా కావడం విశేషం.. గతంలో అజయ్ దేవగన్ తో హిందీ దృశ్యం సినిమాలో శ్రియ నటించగా, ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమాలో శ్రియ నటించింది.

శ్రియ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళు అయినప్పటికీ అవకశాలని అందిపుచ్చుకుంటూ కొనసాగుతుంది. ఇక RRR ని దాదాపుగా 10 భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories