ఆఫీషియల్: రంగమార్తాండలో శివాత్మిక

ఆఫీషియల్: రంగమార్తాండలో శివాత్మిక
x
శివాత్మిక
Highlights

హీరో రాజశేఖర్, జీవిత దంపతుల కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నటి శివాత్మిక..

హీరో రాజశేఖర్, జీవిత దంపతుల కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నటి శివాత్మిక.. మొదటి సినిమాతోనే సహజమైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇద్దరూ లెజెండ్స్‌ కూతురు..నైపుణ్యం, చురుకుదనం, ప్రతిభాసంపత్తులు కలిగిన శివాత్మికతో సినిమా చేయడం ఆనందంగా ఉంది' అంటూ తెలిపాడు.

మరాఠీ చిత్రం 'నటసామ్రాట్‌' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణలు ప్రాధన పాత్రలలో నటిస్తున్నారు. మరాఠీలో ఈ చిత్రం మంచి విజయాన్నీ అందుకుంది. అక్కడ నానా పటేకర్ మెయిన్ లీడ్ లో నటించాడు. ఇప్పుడు ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చేస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాకి సంబంధించినన ప్రతి అప్డేట్ ని కృష్ణవంశీ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు.

రంగస్థల విశ్రాంతకళాకారుడి జీవితం నేపథ్యంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అనసూయ, రాహుల్‌ సిప్లిగంజ్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories