బంపర్ ఆఫర్ కొట్టేసిన దొరసాని

బంపర్ ఆఫర్ కొట్టేసిన దొరసాని
x
shivathmika ( file photo)
Highlights

క్రియేటివ్ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. చేసినవి తక్కువే సినిమాలు అయినప్పటికీ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ .

క్రియేటివ్ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. చేసినవి తక్కువే సినిమాలు అయినప్పటికీ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణవంశీ . నిన్నే పెళ్ళాడుతా, మురారి, ఖడ్గం, రాఖి లాంటి సినిమాలు కృష్ణవంశీ కెరియర్ లో దిబెస్ట్ గా మిగిలాయి. ఈ మధ్య ఆయనకి సరైనా హిట్టు దక్కడం లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న నక్షత్రం సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

అయితే చాలా గ్యాప్ తర్వాత రంగామార్తండ అనే సినిమాని చేస్తున్నాడు కృష్ణవంశీ . మరాఠీ భాషలో మంచి హిట్టు అయిన నటసామ్రాట్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అక్కడ నానా పటేకర్ మెయిన్ లీడ్ లో నటించాడు. ఇప్పుడు ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఈ మధ్యే ఎలాంటి హడావుడి లేకుండా ముహూర్తపు సన్నివేశాన్ని కంప్లీట్ చేసుకున్నా ఈ సినిమా తొలి షెడ్యుల్ ని మొదలు పెట్టింది.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఛాన్స్ దక్కించుకుంది. దొరసాని సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన శివాత్మిక నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రెండో సినిమానే ఏకంగా కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ఈ సినిమాలో శివాత్మిక ఒక గాయకురాలి పాత్రలో కనిపించనుంది.

మరాఠీ బాషలో మంచి హిట్టైనా రంగామార్తండ సినిమాని క్రియేటివ్ దర్శకుడిగా పేరున్న కృష్ణవంశీ రీమేక్ చేస్తుండడంతో ఈ సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories