Sharwanand: డిజాస్టర్ గా మిగిలిన 'జాను'.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే !

Sharwanand: డిజాస్టర్ గా మిగిలిన జాను.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే !
x
Highlights

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం 'జాను'... తమిళ్ లో మంచి హిట్ అయిన '96' సినిమాకి ఇది రీమేక్.

శర్వానంద్, సమంత హీరోహీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం 'జాను'... తమిళ్ లో మంచి హిట్ అయిన '96' సినిమాకి ఇది రీమేక్ ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. . ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 96 సినిమాలోని ఫీల్ ని రీక్రియేట్ చేసారని అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ఇక సమంత, శర్వానంద్ లు తమ నటనతో మెప్పించి సినిమాకే హైలెట్ గా నిలిచారు. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. మొదటి 3 రోజులు కలెక్షన్లు పర్వాలేదనిపించిన ఈ చిత్రం 4 వ రోజు నుండీ మాత్రం దారుణంగా పడిపోయాయి. ఇక ఫైనల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నైజాం 2.89 cr

సీడెడ్ 0.89 cr

ఉత్తరాంధ్ర 1.19 cr

ఈస్ట్ 0.49 cr

వెస్ట్ 0.38 cr

కృష్ణా 0.52 cr

గుంటూరు 0.62 cr

నెల్లూరు 0.23 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.45 cr

ఓవర్సీస్ 0.88 cr

వరల్డ్ వైడ్ టోటల్ 8.54 cr

'96' సినిమాకి ఇది రీమేక్ కావడం, సమంత, శర్వానంద్ లతో సినిమా వస్తుండడంతో ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో ఈ సినిమాకి 21 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమా కేవలం 8.54 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం 12.46 కోట్ల నష్టాల్ని మిగిల్చిందనే చెప్పాలి. అంటే డబుల్ డిజాస్టర్ కంటే ఎక్కువేనన్న మాట..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories