డిగ్రీ కాలేజ్‌ సినిమాపై నిరసనలు

డిగ్రీ కాలేజ్‌ సినిమాపై నిరసనలు
x
Highlights

డిగ్రీ కాలేజ్‌ సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో స్థానిక వీరభద్ర థియేటర్‌ వద్ద SFI విద్యార్థి విభాగం...

డిగ్రీ కాలేజ్‌ సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో స్థానిక వీరభద్ర థియేటర్‌ వద్ద SFI విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. డిగ్రీ కాలేజ్‌ సినిమాను ప్రదర్శించవద్దని ఆందోళన చేపట్టారు. సినిమా పోస్టర్లు చింపి థియేటర్ గేటు ముందు ధర్నా నిర్వహించారు. విద్యార్థులను, మహిళలను కించపరిచే విధంగా ఉన్న చిత్రాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతులు ఇస్తుందని ప్రశ్నించారు.

డిగ్రీ కాలేజ్ సినిమా పోస్టర్లును నల్గొండలో చింపేశారు. సినిమా మొత్తం బోల్డ్ కంటెంట్ కావడంతో ఇప్పుడు ఆ సినిమా పోస్టర్లు సైతం అసభ్యంగా ఉండటంతో మండిపడ్డారు. ఐక్య విద్యార్ధి వేదిక ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని పోస్టర్‌ను దగ్థం చేశారు. యువతను తప్పుదారి పట్టించే విధంగా పోస్టర్లు ఉన్నాయని వాపోయారు. సినిమాకు అనుమతి ఇచ్చిన సెన్సార్‌ బోర్టు సభ్యులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. డిగ్రీ కాలేజ్‌ సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో సినిమాకు సంబంధించిన పోస్టర్లను చింపివేశారు. సినిమాను నిలిపివేయాలంటూ డిమాండ్‌ చేశారు. యువత చెడుదోవ పట్టేందుకు ఇలాంటి సినిమాలు కారణమవుతాయంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories