మేకప్‌కు ప్యాకప్...ఏం జరిగినా నిర్మాతలదే బాధ్యత.. షూటింగ్ గైడ్ లైన్స్ కఠినతరం చేసిన తెలంగాణ

మేకప్‌కు ప్యాకప్...ఏం జరిగినా నిర్మాతలదే బాధ్యత.. షూటింగ్ గైడ్ లైన్స్ కఠినతరం చేసిన తెలంగాణ
x
Highlights

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా షూటింగులకు సంబంధించి పలు మార్గదర్శకాలను...

తెలంగాణలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. ఈ సందర్భంగా షూటింగులకు సంబంధించి పలు మార్గదర్శకాలను ప్రకటించింది. షూటింగ్ స్పాట్ లో డాక్టర్లు కంపల్సరీగా ఉండాలని స్పష్టం చేసింది. మొదటి దశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిచ్చిన సర్కారు.. లాక్ డౌన్ కారణంగా ఆగిన సినిమా, సీరియల్ షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ స్పాట్ లో పాన్ , గుట్కా సేవించడాన్ని నిషేదించింది. షూటింగ్ స్పాట్ లోకి ఎంట్రీ, ఎగ్జిట్ , కామన్ ఏరియాల్లో కరోనా నియంత్రణ చర్యలు తప్పనిసరి చేసింది. స్టూడియోల్లో సందర్శకులకు అనుమతి నిరాకరించింది. అలాగే షూటింగ్ లో పాల్గొనేవారి నుంచి ప్రతీ ఒక్కరికీ మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. యాక్టర్ల ఆరోగ్య భద్రత నిర్మాతలదేనని, ఇందుకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది.

షూటింగ్ లకు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇవ్వడంతో టీవీ, సినీ ఇండస్ట్రీలో సందడి నెలకొంది. లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన నటీనటులు మళ్లీ మేకప్ వేసుకోనున్నారు. మధ్యలో ఆగిపోయిన షూటింగ్ లు మళ్లీ మొదలుకానున్నాయి. కొత్త సినిమాలు రానున్నాయి. రిపీట్ సీరియల్స్ బంద్ అయి కొత్త సీరియల్స్ అలరించనున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories