అదే సెంటిమెంట్ ని నమ్ముకున్న 'ఎంత మంచివాడవురా'

అదే సెంటిమెంట్ ని నమ్ముకున్న ఎంత మంచివాడవురా
x
Entha manchivaadavuraa ( File photo)
Highlights

మొత్తం ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో మూడు తెలుగు సినిమాలు కాగా, మరొకటి డబ్బింగ్ మూవీ.. మళ్ళీ అందులో మూడు పెద్ద సినిమాలు...

మొత్తం ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో మూడు తెలుగు సినిమాలు కాగా, మరొకటి డబ్బింగ్ మూవీ.. మళ్ళీ అందులో మూడు పెద్ద సినిమాలు కాగా, మరొకటి చిన్న సినిమా. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' రజినీకాంత్ 'దర్బార్', కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా'. దీనితో ఈ సారి ప్రేక్షకులకి పండగే పండగ.

అయితే మూడు పెద్ద సినిమాల మధ్య కళ్యాణ్ రామ్ చిన్న సినిమా ఎంత మంచివాడవురా విడుదలవుతుంది. ఈ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకుడు. ఇప్పటికే రీలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దానికితోడు 'శతమానం భవతి' లాంటి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడితో సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి సినిమాని పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినప్పటికీ సినిమాను మాత్రం తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఈ సినిమా పక్కా కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కుతుంది. పండగకి కుటుంబ సభ్యులంతా కలిసి ఓ కుటుంబ కథ చిత్రానికే వెళ్ళాలని అనుకుంటారు. మళ్ళీ ఈ సినిమా సూపర్ హిట్ గుజరాతి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.

అంతేకాకుండా ఈ సినిమాకి మరో సెంటిమెంట్ కూడా ఉంది. గత కొన్నేళ్ళుగా సంక్రాంతికి వచ్చిన సినిమాలోని హిట్లను పరిశీలిస్తే సోగ్గాడే చిన్ని నాయన, శతమానం భవతి, జైసింహా, F2 లాంటి సినిమాలు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యాయి. సో ఆ సెంటిమెంట్ కనుక మరోసారి రిపీట్ అయితే ఎంత మంచివాడవురా హిట్టు అవ్వడం ఖాయం.. మరి చూడాలి ఎం జరుగుతుందో.

ప్రస్తుతం ఎంత మంచివాడవురా షూటింగ్ చివరి దశలో ఉంది. మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. సుహాసిని, శరత్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.జనవరి 15 న సినిమాని విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories