అల్లు అర్జున్ పాటకి చిరంజీవి భామ స్టెప్పులు..వీడియో అదిరిందిగా!

అల్లు అర్జున్ పాటకి చిరంజీవి భామ స్టెప్పులు..వీడియో అదిరిందిగా!
x
Simran(File Photo)
Highlights

అల్లు అర్జున్ హీరోగా , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో '.. ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన

అల్లు అర్జున్ హీరోగా , త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో '.. ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి ముందుగా థమన్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయింది. ఎక్కువగా ''రాములో రాములా, బుట్ట బొమ్మా'' సాంగ్స్ అందరికి బాగా కనెక్ట్ అయ్యాయి.

అయితే ఈ పాటలు టిక్ టాక్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ పాటకి చాలా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ నటులు మాత్రమే కాకుండా విదేశాల్లోని నటులు కూడా ఈ పాటకి ఫిదా అయిపోయి చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే.. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది.

ఇక తాజాగా ఒకప్పటి హీరోయిన్ సిమ్రాన్ కూడా బుట్టబొమ్మ' పాటపై డాన్స్ చేసి ఆదరగొట్టింది. దీనిని చూసిన నెటిజన్లు వావ్! సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

ఇక సిమ్రాన్ 1999 నుంచి 2004 వరకు టాలీవుడ్ లో అగ్ర కథానాయాకగా కొనసాగింది. సమరసింహ రెడ్డి, డాడీ, నువ్వొస్తావని, కలిసుందాం..రా! మొదలగు చిత్రాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ ,మలయాళ, హిందీ భాషలలో కూడా సిమ్రాన్ నటించింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories