బ్రేకింగ్: సరిలేరు నీకెవ్వరు మూవీ లీక్.. ఆన్‌లైన్‌లో వైరల్

బ్రేకింగ్: సరిలేరు నీకెవ్వరు మూవీ లీక్.. ఆన్‌లైన్‌లో వైరల్
x
సరిలేరు నీకెవ్వరు మూవీ లీక్
Highlights

మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంతోషంగా ఉన్న చిత్ర యూనిట్‌కు ఆ సంతోషం నిలవలేదు. భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాను...

మంచి హిట్ టాక్ తెచ్చుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సంతోషంగా ఉన్న చిత్ర యూనిట్‌కు ఆ సంతోషం నిలవలేదు. భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాను అప్పుడే ఆన్‌లైన్‌లో పెట్టేశారు. దాదాపు 45 నిమిషాల సినిమాను సెల్ ఫోన్‌ ద్వారా రికార్డు చేసి షేర్ చేశారు. దీంతో ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా ఇలా పైరసీ కావడంతో మహేష్ అభిమానులతోపాటు చిత్రయూనిట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో మహేష్ బాబు నిర్మించాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజు భారీ అంచనాల నడుమ రిలిజైంది ఈ సినిమా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో విజయశాంతి ప్రకాష్ రాజ్, సంగీత, హరితేజా, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, రఘు బాబు తదితరులు నటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories