మహేష్ భారీ కటౌట్‌

మహేష్ భారీ కటౌట్‌
x
Highlights

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను...

టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ప్రస్తుతం ప్రమోషన్ పనుల్లో బిజీ గా ఉంది చిత్ర యూనిట్. అందులో భాగంగానే ఈ సినిమా ప్రిరీలిజ్‌ వేడుకను ఈనెల 5న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు,

విడుదలకి దగ్గర పడుతుండడంతో ధియేటర్ల వద్ద అప్పుడే పండగ వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పెట్టిన మహేశ్‌బాబు 50 అడుగుల కటౌట్‌ ని ఏర్పాటు చేసారు. ఇది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలోని వెంకట పద్మావతి ధియేటర్‌ వద్ద పెట్టిన కటౌట్లు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అభిమాన హీరో సినిమా సంక్రాంతి హిట్టుగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో మహేష్ ఆర్మీ బ్యాక్ గ్రాప్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, పోస్టర్స్ సినిమాపైన భారీ అంచనాలని నెలకొల్పాయి. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు , అనిల్ సుంకరలతో కలిసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories