సరిలేరు నీకెవ్వరూ.. ఇది ఆ కథేనా?

సరిలేరు నీకెవ్వరూ.. ఇది ఆ కథేనా?
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు అనిల్ రావిపూడి తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ. భారీ తారాగణంతో సినిమా తెరకెక్కబోతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ...

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకుడు అనిల్ రావిపూడి తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ. భారీ తారాగణంతో సినిమా తెరకెక్కబోతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ప్రధాన తారాగనఁ ఎంపిక పూర్తయింది. రష్మిక మందాన హీరోయిన్ గా ఇందులో నటించబోతోంది. ఇక విలన్ గా జగపతి బాబు కనిపించనున్నారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో విజయశాంతి చేయనున్నారు. అన్నట్టు ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మ్ ఆఫీసర్ గా కనిపించనున్నారట.

ఇదిలా ఉండగా, ఈ సినిమా గురించి ఒక కొత్త విషయం ఇపుడు ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ అప్పట్లో తన వందవ సినిమా గురించి అనిల్ రావిపూడిని కథ సిద్ధం చేయమన్నారట. అపుడు ఓ కథని అనిల్ బాలయ్యకు వినిపించారట. దానిని విన్న బాలయ్య చాలా బాగుంది అని, సినిమా చేద్దామని చెప్పారు. అయితే, అనుకోకుండా బాలకృష్ణ తన నూరవ సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి చేశారు. దాంతో అనిల్ కథ వెనక్కి వెళ్ళిపోయింది. ఇపుడు ఈ కథకే కొన్ని మార్పులు చేసి.. మహేష్ బాబుకు అనుకూలంగా మార్చి అనిల్ రావిపూడి సిద్ధం చేశారని టాక్. మరీదెంత వరకూ నిజమో అనిల్ చెప్పాల్సిందే!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories