కొబ్బరిమట్ట సినిమా విడుదల చేయలేదని ఓ అభిమాని ఏకంగా..

కొబ్బరిమట్ట సినిమా విడుదల చేయలేదని ఓ అభిమాని ఏకంగా..
x
Highlights

కొబ్బరి మట్ట'ను తమ ఊరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ను కోరాడు. అయితే ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదు. దీంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక అయోధ్యనగర్‌లోని ఓ సెల్‌టవరెక్కాడు.

హృదయకాలేయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు బర్నింగ్ స్టార్. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు తీసినా కానీ అవి పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. తాజాగా సంపూ నటించిన చిత్రం "కొబ్బరిమట్ట" రూపక్ రోనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను స్టీవెన్ శంకర్ అందించారు. కొబ్బరి మట్ట గత శనివారం విడుదలై ఇప్పటికి ధియేటర్లో దూమ్మురేపుతోంది. దీంతో కలెక్షన్ల పరంగానూ కొబ్బరి మట్ట ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. సంపూర్ణేష్ బాబు కామెడీకి పొట్టచెక్కలవుతున్నాయి అంటూన్నారు చూసిన ప్రేక్షకులు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే సిమాపై ఓ అభిమాని ఏకంగా సెల్ టవర్ ఎక్కి హల్ చేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన రెడ్డెప్ప అనే యువకుడు శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా 'కొబ్బరి మట్ట'ను తమ ఊరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ను కోరాడు. అయితే ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేయలేదు.

దీంతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక అయోధ్యనగర్‌లోని ఓ సెల్‌టవరెక్కాడు. ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించిగా.. హుటాహుటినా ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని ఫోన్‌ చేసి రెడ్డెప్పతో మాట్లాడారు. మీరు కిందకు దిగొస్తే న్యాయం చేస్తామని చెప్పినా కానీ సాయంత్రం ఆరుగంటల వరకూ సెల్ టవర్‌పైనే ఉండిపోయాడు. దీంతో స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రెడ్డప్ప మరింత హంగామా చేశాడు. ఇక లాభం లేదని చిట్టచివరకు అతడి తమ్ముడిని సెల్ టవర్ పైకి ఎక్కించారు పోలీసులు. ఆ తర్వాత కొద్దిసేపటికి రెడ్డెప్ప, అతడి తమ్ముడి మాటలు వినడంతో కొద్దిసేపటికి కిందికి దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కిందికి వచ్చిన రెడ్డెప్ప మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించిన పోలీసులు అతడిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories