సమంత స్టైలిష్ లుక్ అదిరిందిగా

సమంత స్టైలిష్ లుక్ అదిరిందిగా
x
Highlights

తక్కువ టైంలో ఎక్కువ పేరును సంపాదించుకున్న హీరోయిన్ లలో సమంత ఒకరు.

తక్కువ టైంలో ఎక్కువ పేరును సంపాదించుకున్న హీరోయిన్ లలో సమంత ఒకరు. అక్కినేని నాగచైతన్యతో చేసిన ఎం మాయ చేసావే సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత బృందావనం, దూకుడు, అత్తారింటికి దారేది సినిమాలను చేసి స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా నిలిచింది.

సినిమాలు చేస్తున్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత గ్లామర్ షోలకన్నా కథకి, పాత్రకి ప్రాముఖ్యత ఉన్న సినిమాలనే చేసుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే రంగస్థలం, యూ టర్న్ , మజిలి, ఓ బేబీ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి.

ఇక తమిళ్ లో సమంత విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో కలిసి 'సూపర్ డీలక్స్' అనే సినిమాలో నటించింది. ఈ సినిమాకి గాను ఆమెకి జీ సినిమా అవార్డ్స్ 2020 లో ఉత్తమ నటిగా (జ్యూరీ స్పెషల్ మెన్షన్) తో అవార్డు అందుకుంది. అయితే ఈ అవార్డు ఫంక్షన్ లో ఆమె తన దుస్తులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం సమంత శర్వానంద్ తో కలిసి 'జాను' అనే సినిమాని చేస్తుంది. ఈ సినిమా తమిళ్ లో వచ్చిన 96 సినిమాకి రీమేక్.. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories