పవన్ సినిమాలో సమంత? కానీ హీరోయిన్ గా కాదట.. మరి ఏంటి ?

పవన్ సినిమాలో సమంత? కానీ హీరోయిన్ గా కాదట.. మరి ఏంటి ?
x
samantha, pawan kalyan ( file photo)
Highlights

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ రీఎంట్రీపై రకరకాల వార్తలు అయితే వచ్చాయి కానీ అవి కేవలం వార్తలకి మాత్రమే మిగిలిపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా అయిన పింక్ సినిమాని పవన్ రీమేక్ చేయనున్నారని వార్తలు బలంగా వినిపించాయి. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ కూడా తన అధికార ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు కూడా..

ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ తో కలిసి, దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తారని, దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తారని చెప్పుకొచ్చాడు. కానీ ఏది ఎప్పుడు పట్టాలేక్కనుంది అన్నది తెలియదు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమాచారం. అయితే ఓ ముఖ్య పాత్ర కోసం చిత్ర యూనిట్ హీరోయిన్ సమంతని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. హిందీ పింక్ లో ఆ పాత్రను తాప్సీ చేయగా తమిళ్‌లో, శ్రద్ధా శ్రీనాథ్ చేసింది. ఇప్పుడు ఆ పాత్రను తెలుగులో సమంత చేయనుందనీ టాక్ బలంగా వినిపిస్తుంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

పెళ్లి తర్వాత పాత్రకి ఎక్కువగా స్కోప్ ఉన్న రోల్స్ చేస్తుంది సమంత. సినిమాలో ఆ పాత్ర ముఖ్యం కావడంతో చిత్ర యూనిట్ సమంతని అప్రోచ్ అయ్యారని వినికిడి. గతంలో పవన్ కళ్యాణ్, సమంత కలిసి అత్తారింటికి దారేది సినిమాలో నటించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సమంత కోలీవుడ్‌ లో సూపర్‌ హిట్ అయిన 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమాలో శర్వానంద్‌కు జోడిగా నటిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories