వెంకీమామలో ఉహించని గెస్ట్?

వెంకీమామలో ఉహించని గెస్ట్?
x
Highlights

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీమామ..మల్టీ స్టారర్ గా వస్తున్నా ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తోన్న చిత్రం వెంకీమామ..మల్టీ స్టారర్ గా వస్తున్నా ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి సురేష్ బాబు నిర్మించారు. బాబీ(కే. యస్ రవీంద్ర) దర్శకత్వం వహించాడు. పూర్తి వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమాని రేపు ( డిసెంబర్ 13 )న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటివలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. అయితే ఈ సినిమాలో సమంత ఓ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. వెంకీమామ కథలో అతిథి పాత్ర కీలకం అయిందట. ఆ పాత్ర సినిమాలోని కీలక సమయంలో రావడంతో సమంతను ఈ పాత్రకోసం తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపైన క్లారిటీ రావాలంటే సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడక తప్పదు.గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories