చైతూకి ఎంత కట్నం ఇచ్చావు సమంతా?

చైతూకి ఎంత కట్నం ఇచ్చావు సమంతా?
x
Highlights

సినిమాకి ప్రచారం ఎంత బావుంటే అంత ఓపెనింగ్స్ వస్తాయి. అందులోనూ హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలైతే ఎంతో ప్రచారం కావాలి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమాంత...

సినిమాకి ప్రచారం ఎంత బావుంటే అంత ఓపెనింగ్స్ వస్తాయి. అందులోనూ హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలైతే ఎంతో ప్రచారం కావాలి. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమాంత ఓ బేబీ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే ఆ సినిమా టీజర్లు, ట్రైలర్లు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇక సినిమా విడుదల దగ్గరయ్యే కొద్దీ మరింత ప్రచారం చేయడానికి సిద్ధమయింది యూనిట్. నందినీ రెడ్డి సినిమాల్ని ప్రమోట్ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటారు. అదే పని ఓ బేబీ కోసం కూడా చేశారు. ఓ యూట్యూబ్ చానెల్ కోసం సోషల్ మీడియా స్టార్ గా చెప్పుకునే గంగవ్వతో సరదా ఇంటర్వ్యూ చేయించారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. గంగవ్వ అడిగిన సరదా ప్రశ్నలకు సమంత చిలిపి సమాధానాలు అభిమానులకు తెగ నచ్చేశాయి.

సమంతా.. పెళ్ళికి ఎంత కట్నం ఇచ్చావని గంగవ్వ అడిగితే.. చాలా ఇచ్చాను.. చెవిలో చెప్తాను అంటూ సమంత సమాధానం చెప్పటం ఆకట్టుకుంటోంది.

ఇంట్లో వంట ఎవరు చేస్తారనే గంగవ్వ ప్రశ్నకు దానికి ''మీ అభిప్రాయంలో అయితే నేనే చేయాలి. కాబట్టి రేపట్నుంచి నేనే వంట చేసి పెడతాను.'' అంటూ సమంత నవ్వేసింది.

ఇక సినిమాల్లో తాళి కట్టే సీన్లలో మీరు చేస్తే మీ భర్త ఏమీ అనరా.. అంటూ గంగావ్వ అడగడంతో.. నందినీ రెడ్డి తో పాటు, సమంత కూడా బిగ్గరగా నవ్వి.. ఎవరికీ ఆ సీన్ వెనుక వుండే సీక్రెట్ చెప్పేశారు.

అదే విధంగా పనిలో పనిగా నందినీ రెడ్డి ని కూడా గంగావ్వ వదలలేదు. మీరు ఫెంట్లు వేసుకుంటే మీ సారేమీ అనరా.. నాకులా చీర ఎందుకు కట్టుకోరు? అని ప్రశ్నించింది. దానికి నందినీ రెడ్డి అవ్వా.. నాకింకా పెళ్లి కాలేదు. నేను చీర కట్టుకుంటే పరిగెత్తి పనిచేయలేను.. అందుకే కట్టుకొను అంటూ సమాధానమిచ్చారు.

ఇలా షోలో పలు సరదా ప్రశ్నలు చిలిపి జవాబులతో సమంత.. నందిని రెడ్డి ఇంటర్వ్యూ సాగిపోయింది. మొత్తమ్మీద ఇంటర్వ్యూ తో సరికొత్తగా ప్రచారాన్ని చేస్తున్నారు మూవీ టీం

Show Full Article
Print Article
More On
Next Story
More Stories