అది అలవాటైపోయింది : సమంత

అది అలవాటైపోయింది : సమంత
x
Highlights

సమంత టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్. సినిమా సినిమా కి ఆమెకి అభిమానులు పెరిగిపోతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తనకి నచ్చిన లేదా...

సమంత టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్. సినిమా సినిమా కి ఆమెకి అభిమానులు పెరిగిపోతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తనకి నచ్చిన లేదా నచ్చని సంగతుల్ని వెంట వెంటనే సోషల్ మీడియాలో అందరితో పంచేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన విషయాలు ఒక్కోసారి విపరీతంగా విమర్శల పాలవడం.. చాలా మంది ఓవర్ గా రియాక్ట్ అవడం తరచూ జరుగుతుంటుంది.

ఇపుడు ఈ విషయంపై నాకు ట్రోలింగ్స్‌ కొత్తేమీ కాదంటూ సమంత పాజిటివ్‌గా స్పందించారు. సమంత మాట్లాడుతూ 'మొదట్లో ట్రోలింగ్‌ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. వాటి గురించి ఆలోచించినపుడు పిచ్చిదాన్నైపోతానేమో అనిపించింది. వాటివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానేమోనని భయం వేసింది. కానీ ఇపుడు దాన్నుంచి నేను బయటపడ్డాను'. ఏ ట్రోల్స్‌ వల్లైతే బాధపడ్డానో ఇప్పుడు వాటిని చూసే నవ్వుకుంటున్నా అన్నారు. ట్రోల్స్‌ను కూడా ఎంజాయ్‌ చేస్తున్నా అంటున్నారు.

"నేను ట్వీట్ చేసినా, చిత్రాన్ని పోస్ట్ చేసినా తర్వాత ఏదో ఒక ట్రోల్‌ జరుగుతుందని నాకు తెలుసు. నేను ఏది పోస్ట్‌ చేసినా దానిపై విమర్శలు చేయడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు" అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఓ బేబీ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కొరియన్‌ సినిమా 'మిస్‌ గ్రానీ'కి ఇది రీమేక్‌. ఈ సినిమాలో సమంత 70 సంవత్సరాల వృద్ధురాలి నుంచి 20 ఏళ్ల యువతిగా మారిన

పాత్రలో కనిపించనున్నారు. ఈ లేడీ ఓరియెంటెడ్‌ సినిమా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories