సైరా షూటింగ్ పూర్తయింది!

సైరా షూటింగ్ పూర్తయింది!
x
Highlights

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'సైరా' షూటింగ్‌ ముగిసింది. ఈ విషయాన్ని 'సైరా'...

స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'సైరా' షూటింగ్‌ ముగిసింది. ఈ విషయాన్ని 'సైరా' సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించిన 'సైరా' టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిందన్నారు. మొత్తానికి చిత్రం అద్భుతంగా వచ్చిందన్నారు.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో , చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా విజయ్‌ సేతుపతి, నయనతార వంటి బడా స్టార్లు కూడా భాగమయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాత కాగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కోసం ఫిల్మ్‌ దునియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఖైదీ నంబర్‌ 150 సినిమాతో భారీ హిట్‌ కొట్టిన చిరంజీవి సైరాతో మరోసారి రికార్డులు బ్రేక్‌ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories