మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి

మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి
x
Highlights

ఎంసీఏ చిత్రంలోని ఏవండోయ్ నాని గారు అనే సాంగ్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. తాజాగా ఈ పాట వంద మిలియ‌న్ వ్యూస్ మార్క్ కి రీచ్ అయింది.

హీరోయిన్ సాయిపల్లవి ఎంత మంచి నటినో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు... ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ భామ తన డాన్స్ తో కూడా మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఆ సినిమాలోని " వచ్చిండే పిల్లా మెల్లాగా వచ్చిండే" అనే పాటలో ఆమె వేసిన స్టెప్స్ కి ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. ఈ పాట యుట్యూబ్ లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అ తర్వాత ధనుష్ తో ఆమె చేసిన మారి 2 చిత్రంలో రౌడీ బేబి అనే సాంగ్‌ బాగా క్లిక్ అయింది. ఈ పాట కూడా రికార్డుని క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ పాటలను దాటుకొని ఎంసీఏ చిత్రంలోని ఏవండోయ్ నాని గారు అనే సాంగ్‌ సరికొత్త రికార్డును సృష్టించింది. తాజాగా ఈ పాట వంద మిలియ‌న్ వ్యూస్ మార్క్ కి రీచ్ అయింది. దీంతో సాయి ప‌ల్లవి ఖాతాలో మ‌రో రికార్డ్ చేరినట్టు అయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories