మెగా మేనల్లుడుకి సినిమా కష్టాలు

మెగా మేనల్లుడుకి సినిమా కష్టాలు
x
సాయి ధరమ్ తేజ్
Highlights

మెగా మేనల్లుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యడు హీరో సాయి ధరమ్ తేజ్.

మెగా మేనల్లుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో సాయి ధరమ్ తేజ్ .. మొదట్లో మంచి హిట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి. ఏకాంగా డబల్ హైట్రిక్ ప్లాపులు రావడంతో సాయికి హిట్టు తప్పానిసరి అయిపొయింది. ఈ తరుణంలో కిషోర్ తిరుమలతో చేసిన చిత్రలహరి మంచి విజయాన్ని అందించింది.

సినిమా సక్సెస్ కావడంతో చేయబోయే సినిమా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు సాయి . ఈ క్రమంలో మారుతీ దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమాని మొదలు పెట్టాడు. పక్కా ఫ్యామిలీ కథగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సాయికి జోడిగా మేహరీన్ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సినిమా సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇదే రోజు బాలకృష్ణ సినిమా రూలర్ విడుదలవుతుంది. కేయస్ రవికుమార్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. రెండు కథలు వేరువేరు అయినప్పటికీ బాలకృష్ణ సినిమా ప్రభావం సాయి సినిమాపై పడే అవకాశం ఉంది.

ఇక రవితేజ నటిస్తున్న డిస్కో రాజా సినిమాని కూడా అప్పుడే రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.

తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కార్తి తమిళ్ సినిమా దొంగ, సల్మాన్ దబాంగ్ 3 సినిమాలు ఇదే రోజు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అధికారకంగా ప్రకటించలేదు. మరి ఇన్ని సినిమాలు మధ్య సాయి సినిమా ఎంత వరకు తట్టుకొని నిలబడుతుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories