ఈ ఫోటోలో ఉన్న హీరోలు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

ఈ ఫోటోలో ఉన్న హీరోలు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!
x
Ram charan, Sai dharam tej (File photo)
Highlights

ఈ ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. గుర్తుపట్టారా ! ఎవరో కాదండీ మన మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఈ ఫోటోను హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు.

ఈ ఫోటోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. గుర్తుపట్టారా ! ఎవరో కాదండీ మన మెగా హీరోలు రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఈ ఫోటోను హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ఇందులో చరణ్, సాయిలతో పాటు చిరంజీవి కుమార్తెలు సుస్మిత, శ్రీజ కూడా ఉన్నారు. 'చెన్నై నివాసంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. సుస్మిత, రామ్‌చరణ్‌, శ్రీజాలతో నేను' అంటూ సాయి తేజ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. అభిమానులు మాత్రమే కాదు. సెలబ్రిటీలు సైతం బాగున్నారు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్..

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే ).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.

సోలో బతుకే సో బెటర్ ..

గతేడాది 'చిత్రలహరి', 'ప్రతిరోజూపండగే' సినిమాలతో మంచి విజయాలను అందుకొన్ని దూసుపోతున్నాడు హీరో సాయితేజ్‌. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా 'సోలోబ్రతుకే సో బెటర్‌' అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ద్వారా సుబ్బు అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన ఇస్మార్ట్ శంకర్ బ్యూటి నభా నటేశ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని నిర్మిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాని మే మొదటివారంలో రిలీజ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories