ఏంటి బావ పెళ్లి అంట కదా! .. సాయి ధరమ్ తేజ్ ఫన్నీ ట్వీట్

ఏంటి బావ పెళ్లి అంట కదా! .. సాయి ధరమ్ తేజ్ ఫన్నీ ట్వీట్
x
Sai Dharam Tej, Varun Tej(File photo)
Highlights

టాలీవుడ్ హీరోలు మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా లాక్ డౌన్ నిబంధనలతో యంగ్ హీరో నిఖిల్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరోలు మెల్లిమెల్లిగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా లాక్ డౌన్ నిబంధనలతో యంగ్ హీరో నిఖిల్ పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.. ఇక నితిన్ కూడా నిచ్చితార్ధం చేసుకొని పెళ్లికి సిద్దం అయ్యాడు. నిజానికి లాక్ డౌన్ లేకపోతే నితిన్ పెళ్లి ఎప్పుడో అయిపోయేదే. ఇక యంగ్ హీరో రానా కూడా తానూ పెళ్ళికి సిద్దమని ఇటివలే ప్రకటించాడు. ఈ నేపధ్యంలో మెగా బ్రదర్ నాగబాబు తన కూతురుకి వచ్చే ఏడాది పెళ్లి చేయనున్నామని, ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి కూడా ఉంటుందని వెల్లడించాడు.

ఈ నేపధ్యంలో యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా 'నిహారికకు పెళ్లి.. వరుణ్ తేజ్‌కు కూడా` అని వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్‌ను పోస్ట్ చేస్తూ 'ఏంటి బావా.. నీకు పెళ్లంట' అని ప్రశ్నించాడు. దీనికి వరుణ్ తేజ్ స్పందిస్తూ .. 'నా పెళ్లికి చాలా టైమ్ ఉందిలే కానీ, మన దగ్గుబాటి రానా, నితిన్ మాత్రం `ఎప్పటికీ మీతోనే..` అని నమ్మించి మన సింగిల్స్ గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయారు' అంటూ కామెంట్ చేశాడు. వీరి మద్యలో కమెడియన్ వెన్నెల కిషోర్ స్పందిస్తూ.. `ఎప్పటికీ సింగి‌ల్‌గా ఉంటాను, సింగిల్‌గా ఉంటేనే లైఫ్ బాగుంటుంది, సింగిల్ రాక్స్ మొదలైన వాటితో పోల్చుకుంటే.. `దానికి ఇంకా చాలా టైమ్ ఉంది అంటూ స్పందించాడు.

ఇక గతఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ నేపధ్యంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఇది వరుణ్ తేజ్ కి పదో సినిమా కావడం విశేషం.. ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2కి సీక్వెల్ చేయనున్నాడు వరుణ్..





Show Full Article
Print Article
More On
Next Story
More Stories