Top
logo

బాలీవుడ్ లో దుమ్ములేపుతున్న సాహో

బాలీవుడ్ లో దుమ్ములేపుతున్న సాహో
X
Highlights

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది సాహో .. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ , శ్రద్దా కపూర్ హీరో...

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది సాహో .. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ , శ్రద్దా కపూర్ హీరో హీరోయిన్స్ గా నటించారు . దాదాపుగా ఈ సినిమా 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది . సినిమా విడుదలైన మొదటిరోజే మంచి కలెక్షన్లను రాబడుతుంది . ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే సినిమా దుమ్ములేపుతుంది . శుక్రవారం ఈ సినిమా ఏకంగా 24 కోట్లను కొల్లగొట్టింది . 2019 లో బాలీవుడ్ లో విడుదలైన సినిమాల్లో మొదటిరోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో సాహో మూడో స్థానంలో నిలిచింది . అంతకుముందు సల్మాన్ ఖాన్ భారత్ (42 కోట్లు ) , మిషిన్ మంగళ్ (29) కోట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉంది . ఇక అ తరవాత సాహో మూడో స్థానంలో ఉంది . సాహో తర్వాత కళంక్ (21 కోట్లు ), కేసరి (20 ) కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి . ఇక ఓవరాల్ గా సినిమా మొదటి రోజు 100 కోట్లను కొల్లగోట్టిందని, తెలుగులో 42 కోట్లు సాధించిననట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story