సాహో విడుదల వాయిదా?

సాహో విడుదల వాయిదా?
x
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహో! అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు....

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సాహో! అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పడు సాహో సినిమా షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. ఈ విషయాన్ని సాహో టీంలో పలువురు తమ ట్వీట్ల తో సోషల్ మీడియాలో తెలిపారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వీడియో సాంగ్ కూడా ఇటీవల విడుదల చేశారు. దానికీ విపరీతమైన స్పందన వచ్చింది. సాహో నుంచి ఏ వార్త వచ్చినా అది ట్రెండింగ్ అవుతోంది ప్రస్తుతం.

ఇదిలా ఉండగా, ఈ సినిమా విడుదల ఆగస్టు15 అని గతంలో నిర్మాతలు ప్రకటించారు. అయితే, ఇపుడు ఇది వాయిదా పడిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ, తఃరువాతి కార్యక్రమాలు పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశాలు ఉండదడమే కారణంగా తెలుస్తోంది. గ్రాఫిక్స్‌ వర్క్స్‌ భారీగా ఉండటంవల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్లే 'సాహో' విడుదల వాయిదా పడిందని చెబుతున్నారు. సినిమాని ఆగస్టు30 న విడుదల చేయాలని భావిస్తున్నట్టు టాలీవుడ్ టాక్.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories