సాహో టీజర్ వచ్చేస్తోంది!

సాహో టీజర్ వచ్చేస్తోంది!
x
Highlights

ప్రభాస్.. ఇపుడు ఇండియన్ స్టార్. బాహుబలితో అమాంతం రేంజ్ పెరిగిపోయిన తెలుగు హీరో. బాహుబలి తరువాత క్రేజీ సినిమా చేస్తున్నాడు. అదే సాహో. ఇందులో భారతీయ...

ప్రభాస్.. ఇపుడు ఇండియన్ స్టార్. బాహుబలితో అమాంతం రేంజ్ పెరిగిపోయిన తెలుగు హీరో. బాహుబలి తరువాత క్రేజీ సినిమా చేస్తున్నాడు. అదే సాహో. ఇందులో భారతీయ వెండితెర పై మునుపెన్నడూ చూడని యాక్షన్ సన్నివేశాల్ని చూపించబోతున్నారట. ఇప్పటికే ఈ సన్నివేశాలకు సంబంధించిన ప్రోమోలు విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ అభిమానులు.. సినిమా ప్రేమికులు.. సాహో సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు పదిహేనున ఈ సినిమా విడుదలకు అన్నీ సిద్ధం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సాహో టీజర్ ను విడుదల చేయడానికి సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 13 న టీజర్ ను విడుదల చేస్తున్నారు. దానిని 14 నుంచి థియేటర్లలో చూడొచ్చట. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. సుహిట్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories