సాహో కొత్త సంగీత దర్శకుడు జిబ్రాన్?

సాహో కొత్త సంగీత దర్శకుడు జిబ్రాన్?
x
Highlights

ప్రభాస్ సాహో సినిమా శరవేగం తో ముస్తాబవుతోంది. దాదాపు ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రెడీ అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కుతున్న...

ప్రభాస్ సాహో సినిమా శరవేగం తో ముస్తాబవుతోంది. దాదాపు ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా రెడీ అవుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు మొదట శంకర్ ఎహసాన్ లాయ్ ను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వీళ్లు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా వాళ్లు వెల్లడించారు.

దాంతో ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎవరిని తీసుకోనున్నారా అనే చర్చ కొనసాగింది. తాజాగా 'జిబ్రాన్' పేరు తెరపైకి వచ్చింది. తెలుగులో 'బాబు బంగారం' వంటి తెలుగు సినిమాలు చేసిన జిబ్రాన్ కి, తమిళంలో 'విశ్వరూపం 2' వంటి భారీ సినిమాకి పనిచేసిన అనుభవం వుంది. అందువలన 'సాహో' కోసం ఆయనని తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. ఆగస్టు 15 న సినిమా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories