సాహో టీజర్ కు అభిమానులు సాహో!

సాహో టీజర్ కు అభిమానులు సాహో!
x
Highlights

అదీ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే.. ఒక్క టీజర్ తో సినిమాని అమాంతం లేపేశారు. ఆరే ఆరు గంటలు 25 మిలియన్ల వ్యూస్.. అంటే నిమిషానికి ఎంతమంది చూసుంటారో లేక్కేయండి....

అదీ ప్రభాస్ ఫ్యాన్స్ అంటే.. ఒక్క టీజర్ తో సినిమాని అమాంతం లేపేశారు. ఆరే ఆరు గంటలు 25 మిలియన్ల వ్యూస్.. అంటే నిమిషానికి ఎంతమంది చూసుంటారో లేక్కేయండి. ఈరోజు ఉదయం తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లో సాహో టీజర్ విడుదలైంది. విడుదలైన ఆరు గంటల్లోనే మిలియన్లలో దీనిని అభిమానులు చూశారు. అంతే కాదు టీజర్ అద్భుతం అంటూ సెలబ్రిటీలు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక అభిమానులైతే ప్రభాస్ చెప్పిన రెండు డైలాగులకే పూర్తిగా పడిపోయారు. తెలుగు సినిమా స్థాయిని మరోసారి అంతర్జాతీయంగా నిలబెట్టే సత్తా మా ప్రభాస్ కే ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేస్తున్నారు.

ఇప్పటిదాకా.. తెలుగులో 5.1మిలియన్ మంది , తమిళంలో 3.5 మిలియన్ మంది, మలయాళంలో 4.25 లక్షల మంది, హిందీలో 6.2 మిలియన్ మంది సాహో టీజర్ ను చూశారు. ఇపుడు ఇది డిజిటల్ వ్యూస్ లో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా దూసుకుపోతోంది.

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'సాహో' స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories