సాహో కి తగ్గిన ధియేటర్లు....

సాహో కి తగ్గిన ధియేటర్లు....
x
Highlights

సాహో తొలి వారం పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు సాహో సినిమాని. అదేవిధంగా సాహో సినిమా కోసం అనేక పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు తమ విడుదల వాయిదా వేసుకుని దారిని ఇచ్చాయి. ఇక మొదటి వారం పూర్తీ కావడంతో ఇతర సినిమాల విడుదల జోరందుకుంది. ఈ నేపథ్యంలో సాహో థియేటర్లు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి.

భారీ అంచనాలతో గత నెల( ఆగస్టు ) 30 న ప్రభాస్ నటించిన సాహో ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అయితే ఇప్పుడు ఈ సినిమాకి థియేటర్లు సంఖ్య తగ్గిపోయింది . ఎందుకంటే ఈ రోజు ఏకంగా ఏడూ సినిమాలు విడుదలయ్యాయి . సో ఈ సినిమాలకి థియేటర్లు కేటాయించే నేపధ్యంలో చాలా సెంటర్ల నుంచి సాహో మూవీని తప్పించారు. దీనితో సాహో సినిమాకి అంతో, ఇంతో కలెక్షన్ల తగ్గే అవకాశం లేకపోలేదు ...

ఈ రోజు (శుక్రవారం) మొత్తం ఏడు సినిమాలు విడుదలయ్యాయి . ఈ సినిమాలకి గాను ప్రస్తుతం సాహో సినిమా నడుస్తున్న థియేటర్లు నుండి 30 శాతం థియేటర్లు ఈ సినిమాలకి వచ్చాయి . దాదాపుగా ఇవన్ని చిన్న సినిమాలే ... ఇందులో ఆది సాయి కుమార్ నటించిన జోడి సినిమా కొంచం పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు . ఇవే కాకుండా ఉండిపోరాదే, దర్పణం, 2 అవర్స్ లవ్, నీకోసం సినిమాలు ఉన్నాయి . ఇవే కాకుండా రెండు డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి . అందులో జీవా, నయనతార నటించిన వీడే సరైనోడు,ఆండ్రియా, అంజలి నటించిన తారామణి అనే సినిమాలు ఉన్నాయి .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories